Tuesday 17 April 2012

అక్షయ గోల్డ్ చేసేది పచ్చి మోసమే


                                                  
అక్షయ గోల్డ్ పై  పోలీసులు దాడి చేసిన తరువాత ఈ మధ్యన భారి ఎత్తున ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టింది. ఆ ప్రకటనలలో తాము బిద ప్రజలకు ఇళ్ళ స్థలాలు తక్కువ ధరల్లో ఇవ్వడానికి కృషి చేస్తున్నామని ప్రకటిస్తున్నారు.
నిజానికి అక్షయ గోల్డ్ కేవలం ప్రజల దగ్గర నుంచి చట్ట విరుద్ధంగా భారీ ఎత్తున డిపాజిట్లు వసూలు  చేస్తోంది. ఈ సంస్థ అగ్రిగోల్ద్ సంస్థ ను ఆదర్శంగా తీసుకుని ఇలా డబ్బు వసూలు చేస్తోంది. అగ్రిగోల్ద్ కూడా ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తోంది.
ఈ విషయం కార్పొరేట్ ఫ్రాడ్స్ వాచ్ ప్రజల దృష్టికి పోలిసుల దృష్టికి ఎప్పుడో తీసుకెళ్ళింది. రామచంద్రాపురం పొలిసు స్టేషన్ లో అగ్రిగోల్ద్ సంస్థ పై క్రిమినల్ కేసు కూడా నమోదు చేసింది.
అక్షయ గోల్డ్ కాని అగ్రిగోల్ద్ కాని వారి దగ్గర డిపాజిట్లు చేసిన వారందరికి ఇళ్ళ స్తలాలు ఇవ్వడానికి వారి దగ్గర సరిపోను భూమి లేదు. పోలీసులు ఈ దశలో దర్యాప్తు చేస్తే మొత్తం మోసం బయట పడుతుంది.
ఎంత మంది నుంచి డబ్బు వసూలు చేసారు ఎంత మందికి స్తలాలు ఇచ్చారు, ఎవరికైనా స్తలం ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయా? అన్న అంశం పై పోలీసులు దృష్టి సారించాలి.
డబ్బు వసూలు చేస్తున్నపుడు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులో ఏజంట్ల కమిషన్ ఎంత చెల్లించారు. ఈ అంశాల పై విచారణ చేస్తే, ఇది ఒక మని సర్కులేషన్ పథకం అని స్పష్టమై పోతుంది.
ఇదిలా ఉండగా, భారతీయ రిజర్వు బ్యాంకు ఎప్పుడో 1986 లోనే ప్రజల దగ్గర నుంచి అక్రమంగా బ్యాంకు అనుమతి లేకుండా డిపాజిట్లు వసూలు చేయడానికి రాష్ట్ర పోలీసులు కృషి చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. పోలిసుల దగ్గర చాలినంత బలగం లేక ఇంట కాలం ఎటువంటి చర్యలు తీసుకోలేక పోయారు. ఇప్పుడు ఇటువంటి నేరాల మిద దృష్టి సారించారు కాబట్టి ఈ దిశలో దర్యాప్తు చేస్తే అసలు దోషులు బయట పడతారు.
ఎంత మంది ఏజంట్లు ఉన్నారు, వారికీ ఎంత కమిషన్ చెల్లించారు అన్న అంశం పై దర్యాప్తు చేస్తే మని సర్కులేషన్ కోణం బయట పడుతుంది. ప్రజలను తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ పెట్టి వారిని పథకంలో చేర్పించారు కాబట్టి అక్షయ గోల్డ్ నిర్వాహకులను సెక్షన్ 420 క్రింద కూడా నమోదు చేయాలి.
శ్యామ సుందర్ 
కార్యదర్శి 
కార్పోరేట్ ఫ్రాడ్స్ వాచ్ 
విజయవాడ 

3 comments:

sanjeev said...

Dear shyam
I am really appreciating you.actually as per my knowledge in agri gold 15000 cr public deposit, akshaya is having 1500cr, welfare run by standing MLA is having 1000cr, myth ri group is having 500cr of public money and many more companies is having thousands of crores of poor people money. There is no rules no guide lines for spending of public deposits.they r real cheaters. For example agri gold is collecting 200 cr public money per month in this 30percent commission means straight away they are loosing 60 crores per month means just imaging what is the huge loss off agri gold as per my knowledge now agri gold is a loss of around 7000 crores one fine day lakhs of its agents are going to suicide. I request all statutory bodies to stop this buisiness immidiatly other wise lakhs of agents are going to suicide. Dear Shyam pl fight againist these companies v all r with u . See u next bye

Kishore babu said...

Dear Shyamm garu,

Iam aopperciating ur team work .in vijayawada not only akshayagold other than it some companies are doing the same business like Abhayagold, Agrigold, Achalagold, Janahithagold please concentrate on this companies and make free the people from that companies

Paulson said...

Dear Shyam,

Can we register a complaint in "http://scores.gov.in" as Iam not getting refund/reply since last 8 months.

Paulson, Chirala