Tuesday, 4 October 2011

మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఆంటే ఖచ్చితంగా మోసమే

అభిరాం అనే మిత్రునికి మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసమా కాదా అని అనుమానం వచ్చింది. అది ఖచ్చితంగా మోసమే అని చెప్పవచ్చు.
ఒకరు ఇద్దరినీ ఆ ఇద్దరు మరి ఇద్దరినీ చేర్పించడం అనేది ఈ మార్కెటింగ్ పధ్ధతి. దీనిని నిరంతరంగా సాగే గోలుసుకట్టుగా చెప్పవచ్చు. ఈ గొలుసు నిరంతరం సాగదని త్వరలోనే తెగి పోతుందని అందరికి తెలుసు. ఇలా తెలిసి సభ్యులుగా చేర్పించడం అనేది మోసం క్రిందకు వస్తుందని సుప్రీం కోర్ట్ కురియచన్ చాకో కేసులో (2008) స్పష్టం చేసింది.
ఇంకా కేరళ విషయానికి వస్తే, కేరళ ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటో చెప్పింది. సభ్యత్వ రుసుం వసూలు చేయ కూడదని, ఇంటింటికి వెళ్లి వస్తువులు అమ్మే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులు దగ్గర ఉంచుకోవాలి అని స్పష్టం చేసింది.
దొంగ వ్యాపారాలు చేసే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు వీటిని అనుసరించడం లేదు అందుకనే వీటిని మోసం అంటున్నాను. 
ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు సంగతి చూస్తె, ప్రతి సంవత్సరం సభుత్వ రుసుం వసూలు చేస్తాయి. ప్రతి నెల తప్పని సరిగా కనీసం కొన్ని ఉత్పత్తులు కొనాలి. ఆ ఉత్పత్తులు అన్ని ఎక్కువ ఖరీదుతో ఉంటాయి కాబట్టి వీటిని సభ్యులు తిరిగి ఎవరికైనా అమ్మడం దాదాపు అసాధ్యం. అందువల్ల ఎక్కువ శాతం సభ్యులు మానేస్తు ఉంటారు. కాని వారు ఎందుకు మానేసారో వారు ఎవరికీ చెప్పారు.
అంతే కాదు వారు కంపెని చేసింది మోసం అని గ్రహించక, తప్పు వారిదని భావిస్తారు. ఇందువల్ల ఇటువంటి కంపెనీల్లో చేరే వారిలో ఎక్కువ మంది అతి కొద్ది కాలంలో మానేస్తారు కాని కంపెనీల పై మోసం చేసారని కేసులు పెట్టరు. అదికాక వారిని సభ్యులుగా చేర్పించిన వారు వారి స్నేహితులు కాని బంధువులు కాని అయి ఉంటారు కాబటి, కేసులు పెట్టరు. కాని అటువంటి కంపెనీలో చేర్పించినందుకు వారిని మరెప్పుడు నమ్మరు. ఇలా సాంఘిక సంబంధాలు దెబ్బ తింటున్నాయి. 

8 comments:

2021 said...

శ్యాం సుందర్ గారికి నమస్కారం!


మీరు పంపిన బుక్లెట్ చదివిన తరువాత నేనొకటి అనుకున్నాను , మీరేమీ తప్పుగా భావించకండి ఎన్నో కంపెనీలు ఈ నెట్ వర్క్ మార్కెటింగ్ విధానం ద్వారా ప్రజలను మోసగించడం వలన ఈ విధానంలో వ్యాపారం నిర్వహించే ప్రతి కంపనీ కూడా అలాంటిదే అని చాలా మంది పోరాబడుతున్నారని అనుకుంటుంన్నాను. నేను ఎవరిపక్కన పక్షపాతంతో మాట్లాడటం లేదు కేవలం నిజం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీరు " హెర్బల్ లైఫ్ " ఉత్పత్తుల వలన బరువు తగ్గటం జరగదని అన్నారు కాని అది తేల్చవలసింది ఒక డాక్టర్ అని నా అభిప్రాయం. చెన్నై అపోలో హాస్పిటల్ వాళ్ళు ఈ ఉత్పాదనని కొంత మంది ఊబకాయులకి ఇచ్చి పరిశోధించి చాలా చక్కగా పనిచేస్తోందని మెడికల్ రిపోర్టులు కూడా ఇవ్వడం జరిగింది, నాకు తెలుసు "మితాహారం తీసుకుంటూ వ్యాయామం చేయటం వలన మాత్రమే బరువు తగ్గడం వీలవుతుందని" మీరంటారని కాని అలా తీసుకోవడం వలన మీ శరీరంలో కండ బరువు తగ్గుతుంది కాని కొవ్వు బరువు తగ్గదు. అయితే ప్రతి నేలా కొంత ఉత్పత్తులనైనా కొని అమ్మాలనే నిభందన ఉంది అది అందరికి సులభమైన విషయం కాదు, ఈ విషయంలో నేను మీతో ఏకీభవిస్తున్నాను. అదే విదంగా ఆర్.యమ్.పి అనే కంపెనీ లోని సభ్యులు ప్రతినెలా వస్తువులు కొనాల్సిన పని లేదు , జీవితంలో కేవలం ఒక్క సారి మాత్రమే మీకు నచ్చిన మరియు మీకు ఉపయోగపడే వస్తును కొనుగోలు చేస్తే సరిపోతుంది, అంతే కాకుండా ఈ వ్యాపారంలో సభ్యులవడానికి ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు కదా? మరి ఇవి ఎ విధంగా చట్ట విరుద్ధం అని అనుమానం?

అలాగే "మల్టీ లెవెల్ మార్కెటింగ్ " అనబడే వ్యాపార విదానంకి త్వరలోనే ఒక యాక్టు వస్తే మీరు ఎలా రియాక్టు అవుతారు? కంపెనీ మద్రాసు హై కోర్టు ఆమోదించిన లీగల్ డాక్యుమెంట్లు ఇవి వీటికి మీ సమాధానం ఏమిటి ? http://rmpislegal.blogspot.com/

మీరు న్యాయ వృత్తి చేపట్టిన వారు గనుక నా అనుమానం తీర్చగలరని ఆశించి మాత్రమే ఈ ప్రశ్నలు అడగబడినవి, దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను, నేను తటస్థంగా మాత్రమే ఈ ప్రశ్నలు అడగటం జరిగింది. ఏది నిజం ఆన్నది మాత్రమే నాకు ముఖ్యం ఎవరు నిజం అన్నది కాదు.మీ మిత్రుడు అభిరాం

Shyam Sundar said...

After going through the documents you have forwarded I understand either you are innocent who is carried away by the dubious ways of RMP Infotec or cunningly supporting a fraudulent company.
The documents you have forwarded proved nothing. The legal opinions by some advocates is not proof of legitimacy.
The writ petition filed by RMP Infotec in Madras High Court also proved nothing. All these fraudulent companies file writ petitions in the High Court to avoid police investigation. If the State Government did not file affidavit, it would be pending. There are several such writs in the High Court of Andhra Pradesh and Corporate Frauds Watch vacated them by filing implead petitions in the case of 14 writs.
Certificate Incorporation is also available by paying certain fee for anyone.
If RMP Infotec is legitimate let it file a writ petition in the Andhra Pradesh High Court and see what happens.

Jagdish patra said...

Please clarify that what are the crieteria to be a legal company in India and abroad.

Anonymous said...

Hai sir
I need little clarification sir,
I heared that parliament have passed a bill on "MLM" on 20th dec2002,under Mr.Srinivas Prasad as public distribution minister and got sucess.
And also suprem court have given green signal for MLM on 19th feb 2003.Is it not correct?
i need some more information: Is there any MLM company having legality and running in india?

Shyam Sundar said...

It is not true. In 2008, the Supreme Court of India delivered a judgement against multilevel marketing.
These crooks spread canards to make believe the gullible.

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

Thank you sir,
and is this sahara care ligally approved?.Its also an mlm company running in hyd.And it is in initial stages.Its website is http://www.saharacarehouse.in
i came to know about it frm my friend.pls chek it and inform me sir pls.